మ‌హాత్మా గాంధీకి గవర్నర్‌ తమిళిసై నివాళి

by Hajipasha |   ( Updated:2023-01-30 12:28:25.0  )
మ‌హాత్మా గాంధీకి గవర్నర్‌ తమిళిసై నివాళి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని సోమవారం లంగర్ హౌజ్ బాపూఘాట్‌ను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ సమాజ్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రోటోకాల్ సెక్రటరీ అరవింద్ సింగ్, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ హసీనాతో పాటు పలు ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రభుత్వ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ బృందం బాపూజీ భజన గీతాలను ఆలపించారు. అంతకుముందు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Advertisement

Next Story