హనుమాన్ విజయ యాత్ర.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

by samatah |
హనుమాన్ విజయ యాత్ర.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : శ్రీ హనుమాన్​విజయ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్​ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సీ.వీ.ఆనంద్​తెలిపారు. ట్రాఫిక్​సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడటానికి విధించిన ఈ ఆంక్షలకు అందరూ సహకరించాలని కోరారు. నేటి ఉదయం 11.30గంటలకు గౌలిగూడ రాంమందిర్​నుంచి శ్రీ హనుమాన్​విజయ యాత్ర ప్రారంభమై పుత్లీబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్​చౌరస్తా, డీఎం అండ్​హెచ్చెస్ సుల్తాన్​బజార్​చౌరస్తా, రాంకోఠి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా మీదుగా కొనసాగుతుంది. కాచిగూడ చౌరస్తా నుంచి నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి చౌరస్తా, ఆర్టీసీ క్రాస్​రోడ్స్, అశోక్​నగర్, గాంధీనగర్, వైస్రాయ్​హోటల్​వెనక వైపు నుంచి ప్రాగాటూల్, కవాడీగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్​పేట రోడ్డు, బైబిల్​హౌస్, సిటీలైట్​హోటల్, బాటా షోరూం, ఉజ్జయినీ మహంకాళి ఆలయం, ఓల్డ్​రాంగోపాల్​పేట పోలీస్​స్టేషన్​మీదుగా ప్యారడైజ్​చౌరస్తాకు యాత్ర చేరుకుంటుంది. అక్కడి నుంచి సీటీవో జంక్షన్, లీ రాయల్​ప్యాలెస్, బ్రూక్​బాండ్, ఇంపీరియల్​గార్డెన్, మస్తాన్​కేఫ్ వద్దకు చేరుకుని ఎడమ వైపు తిరిగి తాడ్ బన్​హనుమాన్​ఆలయానికి రాత్రి 8గంటల సమయానికి చేరుకుంటుంది.

కర్మన్​ఘాట్​నుంచి..

ఇక, కర్మన్​ఘాట్​ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరో శ్రీ హనుమాన్​విజయ యాత్ర జరుగుతుంది. ఈ ఊరేగింపు చంపాపేట ప్రాంతం నుంచి హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలోకి ప్రవేశిస్తుంది. చంపాపేట్​చౌరస్తా నుంచి ఐఎస్​సదన్, దోభీఘాట్, మలక్​పేట ఏసీపీ ఆఫీస్, సైదాబాద్, శంకేశ్వర్​బజార్ మీదుగా సరూర్​నగర్​చేరుకుని రాచకొండ పోలీస్​కమిషనరేట్​లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత తిరిగి హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలోకి ప్రవేశించి దిల్​సుక్​నగర్​రాజీవ్​గాంధీ విగ్రహం, మూసారాంబాగ్​జంక్షన్, మలక్​పేట, నల్గొండ చౌరస్తా, ఆజంపురా, చాదర్​ఘాట్​చౌరస్తా మీదుగా వచ్చి ఉమెన్స్​కాలేజీ జంక్షన్​ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు..

లక్డీకాపూల్​నుంచి దిల్​సుక్​నగర్​వైపు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల మధ్య వచ్చేవారు బషీర్​బాగ్, ఓల్డ్​ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్​నగర్​వై జంక్షన్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్​పురా, ఫీవర్​హాస్పిటల్ వద్దకు చేరుకుని కుడివైపు తిరిగి తిలక్​నగర్, అంబర్​పేట ఛే నెంబర్​చౌరస్తా, అలీకేఫ్​చౌరస్తా, మూసారాంబాగ్​మీదుగా దిల్​సుక్​నగర్​చేరుకోవాలని కమిషనర్​ఆనంద్​సూచించారు. దిల్​సుక్​నగర్​నుంచి మెహదీపట్నం వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట రోడ్డు మీదుగా ఆరాంఘర్, అత్తాపూర్​నుంచి ప్రయాణం చేయాలన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 7గంటల మధ్య లక్డీకాపూల్​నుంచి సికింద్రాబాద్, ఉప్పల్​వైపు వెళ్లాలనుకునే వారు విశ్వేశ్వరయ్య విగ్రహం, సోమాజీగూడ, గ్రీన్​ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్​, ప్రకాశ్​నగర్ ఫ్లైఓవర్, ప్యారడైజ్​ఫ్లై ఓవర్​మీదుగా వచ్చి ఎడమవైపు తిరిగి జూబ్లీబస్టాండ్​వద్దకు చేరుకోవాలని చెప్పారు. అక్కడి నుంచి సెయింట్​జాన్​రోటరీ మీదుగా ఉప్పల్​వైపు వెళ్లాలని సూచించారు. ఆయా రోడ్లలో పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని 040–2785 2482 నెంబర్​కు ఫోన్​చేసి తెలుసుకోవచ్చన్నారు. దీంతోపాటు 9010203626 నెంబర్​పై హెల్ప్​లైన్​కు ఫోన్​చేసి సమాచారం పొందవచ్చన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే పోలీసుశాఖ సోషల్​మీడియా యాప్ల ద్వారా తెలియచేయాలని సూచించారు.

Advertisement

Next Story