‘ఫుట్ పాత్ వ్యాపారులకు ఇబ్బందులు కలవకుండా ట్రాఫిక్ అధికారులు చొరవ చూపాలి’

by Aamani |
‘ఫుట్ పాత్ వ్యాపారులకు ఇబ్బందులు కలవకుండా ట్రాఫిక్ అధికారులు చొరవ చూపాలి’
X

దిశ, బేగంపేట: ఫుట్ పాత్ వ్యాపారులు ఇబ్బందులకు గురి కాకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ పోలీసు అధికారులను కోరారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ దేవాలయం, మైత్రివనం ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహించుకునే ఫుట్ పాత్ వ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వహకులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారనే కారణంతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు ఈ చిరు వ్యాపారాలే జీవనాధారం అని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా, చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్టమైన మార్కింగ్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా వ్యాపారులు మార్కింగ్ కు లోపలే ఉండి వ్యాపారాలు చేసుకుంటారని దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో చిరు వ్యాపారులు శ్రీనివాస్, శివ, సంపత్, అనిల్, రామకృష్ణ, కృష్ణ, రాణి కౌర్, బీఆర్ఎస్ నాయకులు కూతురు నరసింహ, బలరాం తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed