- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. టీపీసీసీ కార్యదర్శి
దిశ, నల్లకుంట : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులమతాలను రెచ్చగొట్టి మత పిచ్చి రాజకీయాలు చేస్తుందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ స్కాములు, పేపర్ లీకేజీలతో ఘోరంగా విఫలమైందని, కేంద్రంలో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాహుల్ గాంధీని ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఇందులో భాగంగా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసిందని మండిపడ్డారు.
గడిచిన ఐదు సంవత్సరాల నుంచి దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగినగుణపాఠం చెబుతారని చెప్పారు. నిన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ, నేడు పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీతో ఎంతోమంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని విమర్శించారు. పరీక్షలు నిర్వహించడంలో విద్యాశాఖ, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.