- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలకి విజయ వాహిని ఎలానో, పుస్తకాలకి ఎమెస్కో అలా : త్రివిక్రమ్
దిశ,రాంనగర్ : ముషీరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఉదయం నుంచి ఒకవైపు తుంపర్ల వాన పడుతున్నా.. బుక్ ఫెయిర్‌కు సందర్శకుల తాకిడి తగ్గలేదు. ఉదయం నుంచి చిన్న చిన్న వర్షపు చుక్కల్లో సైతం బుక్ ఫెయిర్ యథావిథిగా కొనసాగింది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని బుక్ ఫెయిర్ నిర్వహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టాల్ నిర్వాహకులను ఉదయం 10.30 కి ప్రాంగణంలోకి అనుమతించారు. బుక్స్ తడవకుండా సకాలంలో స్పందించి, జాగ్రత్తలు తీసుకున్నామని అధ్యక్ష కార్యదర్శులు యాకూబ్, వాసు తెలిపారు. రెండు వేదికలు జనంతో కిక్కిరిసాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు యథావిధిగా సాగాయి.ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో బాలోత్సవ్ కార్యక్రమాలు క్రాఫ్ట్ వర్క్ షాప్ జరిగింది. ప్రగతి విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. బాలసాహిత్య రచయితల సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలోత్సవ్ కోర్డినేటర్లు చొక్కాపు వెంకటరమణ, భూపతి వెంకటేశ్వర్లు ఉన్నారు.కవి సమ్మేళనం, కవులకు సన్మానం హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా తెలుగు కవుల సమ్మేళనం జరిగింది. దర్భశయనం శ్రీనివాసాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ ఈ సాయంకాలం కవులు చదివిన అన్ని కవితలు మార్మికత లేకుండా సూటిగా, సరళంగా ఉన్నాయి. వీళ్లంతా కూడా ప్రజల జీవితానికి దగ్గరగా ఉన్న కవితలనే వినిపించారు. పలుకుబడి, భాష వైవిద్యంగా ఉన్నాయి అన్నారు .
15 మంది కవులు పలు అంశాలపై హృద్యమైన కవితలను చదివి వినిపించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి , హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించారు.ఆకట్టుకున్న పుస్తక స్ఫూర్తి కార్యక్రమం గోరటి వెంకన్నకి బుక్ ఫెయిర్ నిర్వాహకులు సన్మానించారు.హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా జరుగుతున్న పుస్తక స్ఫూర్తి కార్యక్రమంలో గోరటి వెంకన్న పాల్గొన్నారు. కవియిత్రి శిలాలోలిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు పాల్గొన్నారు.
వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ పదో తరగతి దాకా పెద్దగా పుస్తకాలు చదవలేదు. విరాట్ నవల తనని బాగా ప్రభావితం చేసింది. ఆ పుస్తకం చదివితే మంది రచయితలు గుర్తొస్తారు. కృష్ణా రెడ్డి చాలా అద్భుతంగా అనువాదం చేసారు. ఇది నా జీవితంలో చాలా సందర్భాల్లో ఉపయోగపడింది. గెలిచినప్పుడు , ఓడినప్పుడు ఇలా నన్ను నేను తరచిచూసుకునేలా చేసింది. నామిని, కేశవరెడ్డి చాలా ఇష్టం” అన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు యాకూబ్, సెక్రటరీ ఆర్ వాసు, వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జానారెడ్డి తనకు కావాల్సిన పుస్తకాలను కొన్నారు.
రెంటాల జయదేవ రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తక పరిచయ గోష్టి హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా జరిగింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ..సినిమాలకి విజయ వాహిని ఎలాగో, పుస్తకాలకి ఎమెస్కో అలాగా. రెంటాల జయదేవతో అతడు సినిమా చేస్తున్నప్పుడు చెన్నైలో పరిచయం. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకం ఇది. ఇది ఒక నవలలాంటి పుస్తకం. సినిమాలంటే బాగా పిచ్చి ఉన్న వ్యక్తి రెంటాల జయదేవ. ఆయన మరిన్ని పుస్తకాలు రాయాలి” అని అన్నారు.కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ, “ తెలుగు సినిమా చరిత్ర చదవాలంటే ఈ పుస్తకం చదవాలి. అయితే ఇందులో తమిళ్, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలు సమాంతరంగా ఎలా అభివృద్ధి చెందాయి వివరంగా రాశారు” అన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, “ రచయిత రెంటాల జయదేవ ఈ పుస్తకాన్ని అథారిటీస్ గా, అథెంటిక్ గా , అక్యూరేట్ గా రాశారు” అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “ చాలా లోతుగా పరిశోధించి వాస్తవాలను వెలికి తీసాడు రెంటాల.సిరివెన్నెల సీతారామశాస్త్రికి గద్యరూపం త్రివిక్రమ్”అన్నారు ఎమెస్కో విజయ్ కుమార్. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సెక్రటరీ వాసు, మామిడి హరికృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ కౌండిన్య, కొమ్మినేని వెంకటేశ్వరరావు, కె. దశరథ్, పులగం చిన్నారాయణ, కిష్టారెడ్డి, సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.