- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దండుపాళ్యం, కాళకేయ ముఠా తెలంగాణను పట్టి పీడిస్తోంది.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: దండుపాళ్యం, కాళకేయ ముఠా తెలంగాణను పట్టి పీడిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్ఎస్, తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్‌కి జేడీఎస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అటు బీఆర్ఎస్‌కు తెలంగాణలో ఎంఐఎం సైతం పరోక్షంగా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మూడు పార్టీలపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, జేడీఎస్ కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేసిన కుట్ర విఫలమైందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమారస్వామితో బీఆర్ఎస్ మైత్రి ఏంటని ప్రశ్నించారు. కుమారస్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీశ్ రావు డైరెక్షన్‌లో జరిగిందని రేవంత్ ఆరోపించారు. సైబర్ క్రైమ్‌లో గజరావు భూపాల్ తమ అందరి ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత హ్యాకింగ్ జరుగుతున్నా ఈసీ ఎందుకు సైలెంట్‌గా ఉందన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై ఈసీ అధికారులు ఎందుకు కేసులు పెట్టడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.