- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ACP Krishnaiah : దేశ అభివృద్ధి కోసం నేటి యువత పాటుపడాలి
దిశ, ఎల్బీనగర్ : ప్రతి పౌరుడు దేశం కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన పురస్కరించుకుని ఏసీపీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తా నుండి విక్టోరియా మెమోరియల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడే విధంగా ప్రతిజ్ఞ చేశామని ఆయన తెలియజేశారు.
అలాగే దేశం ఐక్యత సమగ్రత భద్రత కోసం ప్రతి పౌరుడు కంకణ బదులు కావాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏసీపీ కృష్ణయ్య పేర్కొన్నారు . ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని ఒక పోలీసు అని ఆయన వెల్లడించారు. పోలీసులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, నాగోల్ ఇన్స్పెక్టర్ సూర్య నాయక్, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సరూర్నగర్ డిఐ యాదగిరి, సరూర్నగర్ ఉమెన్ పి ఎస్. సి ఐ సుధాకర్ పలువురు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.