నగరంలో జోరువాన.. మియాపూర్‌లో పిడుగుపాటు

by Mahesh |
నగరంలో జోరువాన.. మియాపూర్‌లో పిడుగుపాటు
X

దిశ, శేరిలింగంపల్లి: జోరు వానతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. గత రాత్రి చినుకు చినుకుగా ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము నుంచి భారీగా కురుస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మంగళవారం ఉదయం 5.44 గంటలకు మియాపూర్ లో భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. తెల్లవారుజామున కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక ఎడతెరపి లేని వర్షంతో శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద మరోసారి భారీగా వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్, హఫీజ్ పేట్, హైదర్ నగర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, కాలేజీలకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed