డబ్బులు ఇవ్వనందుకు.. యువకుడిపై కత్తులతో దాడి

by Disha News Web Desk |
డబ్బులు ఇవ్వనందుకు.. యువకుడిపై కత్తులతో దాడి
X

దిశ, బేగంపేట: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూలుపురాలో ఆదివారం ఇరు వర్గాల మధ్య కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఇలాహి మసీదు వద్ద తోటి స్నేహితులతో నడుచుకుంటూ వెళుతున్న ప్రదీప్ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన మునీర్, అతని స్నేహితుల కలిసి విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిని మసీదు వద్ద ఉన్న అతని స్నేహితులు ఆపి డబ్బులు అడిగినట్టు బేగంపేట పోలీసులు తెలిపారు. డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహానికి గురైన మునీర్ అతని స్నేహితులు మహమ్మద్ ఒమర్, అబ్దుల్ సమీ, కరీం, మహమ్మద్ షోయబ్, కృష్ణ, సయద్ సమీర్‌లు కత్తితో ప్రదీప్ పొత్తి కడుపులో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న బేగంపేట పోలీసులు అంబులెన్స్ ద్వారా ప్రదీప్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story