- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ పేపర్‌లో కథనం.. ఎస్ఎఫ్ఏ సస్పెండ్
దిశ, సిటీబ్యూరో: దిశ తెలుగు దినపత్రికలో గత నెల 31న ‘బట్టలిప్పి కొడతా’ అనే శీర్షికతో హైదరాబాద్ టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన వార్తకు రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా స్వీకరిస్తున్నట్లు మహిళా కమిషన్ శుక్రవారం ఓ ప్రకటనను జారీ చేసింది. మహిళా కమిషన్ స్పందనతో జీహెచ్ఎంసీ అధికారులు మహిళా స్వీపర్‌ను అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఎస్ఎఫ్ఏను గుర్తించి మూడురోజుల సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. అంతేగాక కమిషన్ ఆదేశాల మేరకు శనివారం బాధితురాలు, శేరిలింగంపల్లి సర్కిల్ శానిటేషన్ అధికారులు బుద్దభవన్‌లోని మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
విజిలెన్స్ విచారణ చేపట్టాలి..
మహిళా స్వీపర్‌ను దూషించిన ఎస్ఎఫ్ఏతో పాటు మెడికల్ ఆఫీసర్ నగేశ్‌పై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టాలని భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జీ.రాజేశ్వర్ రావు, జనరల్ సెక్రటరీ టీ.కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలిసి బాధ్యులైన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన బీఎంఎస్ నేతలు అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్‌ను కలిసి బాధ్యులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. అదనపు కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు.