- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోగులకు కిమ్స్ హాస్పిటల్ అందిస్తున్న సేవలు అభినందనీయం
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : రోగులకు కిమ్స్ ఆస్పత్రి అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ మేరకు శనివారం కిమ్స్ ఆస్పత్రి , యూపీఐఏల సంయుక్త ఆధ్వర్యంలో యూరోగైనకాలజీ రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సా పద్ధతులపై మూడు రోజుల సదస్సు కిమ్స్ ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ లలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ గైనకాలజిస్టులకు చిన్నపిల్లల సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ఎవరూ చెప్పనవసరం లేదన్నారు. కిమ్స్ ఆస్పత్రి ఈ దేశానికి, రాష్ట్రానికి అందిస్తున్న సేవలు అద్భుతమని, హాస్పిటల్ ఎండీ డాక్టర్ భాస్కరరావును అభినందించకుండా ఉండలేకపోతున్నాను అన్నారు. అక్టోబరు నెల రొమ్ము కేన్సర్ అవగాహన మాసమని, కిమ్స్ ఆస్పత్రి ఈ అంశంపై గ్రామీణ ప్రాంతాల్లోనూ అవగాహన పెంపొందించేందుకు అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన యూరోగైనకాలజీ నిపుణులు కూడా పాల్గొని ఈ రంగంలో వస్తున్న మార్పులు, చికిత్సా పద్ధతులలో వస్తున్న కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు.
సాధారణంగా సమస్యలు ఉన్నప్పుడు మహిళలు యూరాలజిస్టుల వద్దకు వెళ్లడానికి వెనకడుగు వేస్తారని, యూరాలజిస్టులలో అత్యధిక శాతం పురుషులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెప్పారు. అందుకే ఇప్పుడు యూరో గైనకాలజీ అనే ప్రత్యేక విభాగం వచ్చిందని, దీనిద్వారా ఇలాంటి సమస్యలను మొదట్లోనే గుర్తించి వస్తే మందులతో కూడా నయం చేయొచ్చన్నారు. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. భారతీయ మహిళల్లో దాదాపు 40 శాతం మందికి ఈ తరహా సమస్యలు ఉన్నా, ఇప్పటికీ వైద్యులకు చూపించుకునేవారు తక్కువగానే ఉంటున్నారని చెప్పారు. ఉస్మానియా వైద్యకళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మృతదేహాల మీద శస్త్రచికిత్సా పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు కొన్ని విదేశాల నుంచి కూడా గైనకాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొని, ఈ రంగంలో చికిత్సా పద్ధతులపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కరరావు, సదస్సు చైర్‌పర్సన్లు డాక్టర్ బాలాంబ, డాక్టర్ నీనా దేశాయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ అనురాధ కోడూరి, అంతర్జాతీయ యూరో గైనకాలజీ నిపుణులు ప్రొఫెసర్ పీటర్ ఎన్. రోసెన్‌బ్లాట్, డాక్టర్ హోలీ ఎలిజబెత్ రిచర్, డాక్టర్ మార్లీన్ కార్టన్, డాక్టర్ మైఖేల్ డి.మొయిన్, డాక్టర్ రోజర్ పి.గోల్డ్ బెర్గ్, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు డాక్టర్ జె.బి. శర్మ, డాక్టర్ సంజయ్ పాండే, డాక్టర్ సుయాష్ నావల్, డాక్టర్ సీతామహాలక్ష్మి, డాక్టర్ శ్రీకళా ప్రసాద్, డాక్టర్ అమితా జైన్, డాక్టర్ తమిళ్ సెల్వి, డాక్టర్ మీరా రాఘవన్, డాక్టర్ రాజేష్ తనేజా, డాక్టర్ మంగేష్ నర్వాడ్కర్ డాక్టర్ నిర్మలా పాపల్కర్, డాక్టర్ బిందుప్రియ, డాక్టర్ అనురాధ పాండా, డాక్టర్ అపరాజితా డిసౌజా తదితరులు పాల్గొన్నారు.