- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతా ఆన్ లైన్.. హైదరాబాద్ కేంద్రంగా భారీ సెక్స్ రాకెట్..
దిశ, శేరిలింగంపల్లి: లక్జరీ లైఫ్‌ను అలవాటు చేసి అమ్మాయిలను, గృహిణులను తమ స్వాధీనంలో ఉంచుకుని సెక్స్ రాకెట్ నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద సెక్స్ నెట్ వర్క్‌ను చేజ్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశ, విదేశీ అమ్మాయిలు, రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నడుపుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఇటీవల బయటపడ్డ పాతబస్తీ ఘటన మరువక ముందే సైబరాబాద్ పోలీసులు చేజ్ చేసిన సెక్స్ రాకెట్‌లో ఎన్నో కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే భారీ సెక్స్ రాకెట్..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్టు కేసులో సైబరాబాద్ మానవ అక్రమ నిరోధక విభాగం దూకుడు పెంచింది. పోలీసులు కూపీ లాగినకొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పాతబస్తీ ఘటనలో నిందితుడి సెల్ ఫోన్‌లో 50 మంది అమ్మాయిల ఫోటోలు డీటెయిల్స్ ఉంటేనే అవాక్కయిన పోలీసులకు.. సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యభిచార కేంద్ర నిర్వాహకుడు అదీమ్ అలియాస్ అర్నవ్ వద్ద సుమారు 50 వేల మంది అమ్మాయిల ఫొటోలు, వారి వివరాలు బయటపడడం సంచలనంగా మారింది.
ఈ సెక్స్ రాకెట్ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన సూత్రధారి అర్నవ్ తో పాటు మిగిలిన నిందితుల ఫోన్‌లలోనూ వేలాది మంది యువతుల ఫోటోలను గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, ఇంకా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రమేయం ఏంటి.. అన్నది కూడా కూపీ లాగుతున్నారు.
అంతా ఆన్ లైన్.. ఎవరికెవరు కలుసుకునేది లేదు..
ఇంత పెద్ద సెక్స్ నెట్ వర్క్ నడుపుతున్న అర్నవ్ (31) ఈ సెక్స్ రాకెట్‌లోని ఒకరిద్దరికి తప్పా మిగతా వారికి ఎవరికీ తెలియక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. టెక్నాలజీని వాడుతూ ఎప్పటికప్పుడు ప్లేస్ చేంజ్ చేస్తూ నడిపించాడని సైబరాబాద్ డీసీపీ కవిత వెల్లడించారు. అమ్మాయి కావాలంటూ తమను సంప్రదించి విటులకు అమ్మాయిల వివరాలు, కలుసుకునే చోటు, ఎప్పుడు ఎక్కడ మీట్ అవుతారు ఇలా ప్రతీది ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతుంది. అలాగే వారికి డబ్బులు వచ్చేస్తాయి.
రాకెట్‌కు సంబంధించిన అన్నీ ప్రధాన సూత్రదారి అర్నవ్ చూసుకునే వాడని, డబ్బుల వ్యవహారాలు చూస్తున్న కౌర్ కూడా ఇలాగే అనుకోకుండా ఈ వ్యభిచార కూపంలో ఇరుక్కు పోయిందని, ఆమె ఒక విడో అని, అలా తన వద్దకు వచ్చిన కౌర్‌ను అర్నవ్ తన దగ్గరే పెట్టుకుని డబ్బు వ్యవహారాలు అన్నీ ఆమె డీల్ చేసేలా సెట్ చేశాడని, కౌర్ చెల్లెలు కేవైసీ ద్వారా మనీ మ్యాటర్స్ జరిగినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న అర్నవ్ పై హైదరాబాద్, సైబరాబాద్ లిమిట్స్‌లోని 5 పోలీస్‌స్టేషన్‌లో 10 కేసులున్నాయి.
వేగం పెంచిన పోలీసులు..
భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించిన సైబరాబాద్ పోలీసులు ఈ రాకెట్ మూలాలను కూడా ఛేదించి ప్రయత్నంలో తలమునకలయ్యారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల కమిషనర్లతో సంప్రదింపులు జరిపి ఈ రాకెట్ పూర్వపరాలు వెలికి తీయనున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ముఠా ఆర్గనైజర్లు వాడిన వెబ్సైట్లను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన 18 మంది నిందితుల మొబైల్ ఫోన్‌డేటా ఆధారంగా విటుల వివరాలను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకులు కొందరు నగరాన్ని విడిచి వెళ్లినట్టు గుర్తించి ప్రత్యేక బృందాలతో సెర్చ్ స్టార్ట్ చేశారు. కొందరు దిల్లీ, ముంబయి, కోల్ కతాలో ఉంటూ ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించి, వారి కదలికలపైనా నిఘా పెట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన యువతుల ఫోన్‌లోని వివరాల ఆధారంగానూ కూపీలాగుతున్నారు. ఆయా నగరాల పోలీసు కమిషనర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. విటులను మళ్లీ.. మళ్లీ ఆకర్షించేందుకు గంజాయి, డ్రగ్స్‌ను యువతుల ద్వారా ఇప్పించేవారని, ఈ కేసులోని నిందితులతో కొందరు హోటళ్లలో మేనేజర్ స్థాయి వ్యక్తులు కుమ్మక్కై వ్యభిచారానికి సహకరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ర్యాడిసన్ హోటల్ మేనేజర్ రాకేష్‌తో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.
Read more:
- Tags
- Crime News