Governor: చిలకలగూడ మహా మండప గణపతిని దర్శించుకున్న గవర్నర్

by Mahesh |   ( Updated:2022-09-09 07:55:31.0  )
Governor: చిలకలగూడ మహా మండప గణపతిని దర్శించుకున్న గవర్నర్
X

దిశ, సికింద్రాబాద్: బీజేపీ నాయకులు సికింద్రాబాద్ కంటేస్టెడ్ ఎమ్మెల్యే బండపల్లి సతీష్ అడ్బ్రైనలో సికింద్రాబాద్ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన మహా గణపతి మండపానికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండపల్లి సతీష్ ఏర్పాటు చేసిన మహాగణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు బండపల్లి సతీష్ ను గవర్నర్ అభినందించారు.

మనమంతా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం బండపల్లి సతీష్ మాట్లాడుతూ.. ఈరోజు శోభాయాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి రోజు కావడంతో గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారని, వేలాదిగా భక్తులు తరలి రావడం సంతోషకరం అన్నారు. శోభాయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story