సహకార బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలి

by Kalyani |
సహకార బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలి
X

దిశ, హిమాయత్ నగర్ : వ్యవసాయ రంగానికి, రైతుకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న సహకార బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన నిధులలో కొంత శాతం తప్పకుండా సహకార బ్యాంకులలో డిపాజిట్ చేసి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సహకార బ్యాంకులు ఆర్థికంగా ఎదగడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సహకార బ్యాంకుల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందు కోసం ఉద్యోగులు చేసే పోరాటాలకు సీపీఐ అండగా ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్, మ్యాడం అంజయ్యభవన్ శనివారం జరిగిన తెలంగాణ సహకార సెంట్రల్ బ్యాంకుల ఉద్యోగుల అసోసియేషన్ (టీసీసీబీఇఏ) 4వ రాష్ట్ర మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సహకార బ్యాంకుల యాజమాన్యం, ఉద్యోగులు, యూనియన్లు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయడం ద్వారా సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని వక్తలు ఉద్భోదించారు.

మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీసీసీబీఇఏ అధ్యక్షులు, ఏపీటీబీఇఎఫ్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు అధ్యక్షత వహించగా ఎఐసిబిఇఎఫ్ చైర్మన్ తపన్ కుమార్ బోస్, ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్. రవి కుమార్, ఎపిటిబిఇఎఫ్ అధ్యక్షులు రవీంద్రనాథ్, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ నల్లగొండ డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్, టిసిసిబిఇఎ ప్రధాన కార్యదర్శి పి.నాగేందర్, ఎపిసిసిబిఇఎ వైఎస్ చైర్మన్లు కె.టి.రామారావు, వి.రాధాకృష్ణ మూర్తి, టి ప్యాక్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఉప ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్, ఏఐబిఈఏ రాష్ట్ర నాయకులు పి.వి. కృష్ణారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

Next Story