Hyderabad Bonalu: డీజే సౌండ్లు, పోతరాజుల నృత్యాలతో మరికొద్ది సేపట్లో దద్దరిల్లనున్న హైదరాబాద్

by Mahesh |
Hyderabad Bonalu: డీజే సౌండ్లు, పోతరాజుల నృత్యాలతో మరికొద్ది సేపట్లో దద్దరిల్లనున్న హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానరంలో ఆషాడ మాస బోనాల పండుగు అంగరంగ వైభవంగా జరిగింది. 28 ఆదివారం రోజుతో దాదాపు నగరంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇదిలా ఉంటే నేడు ఆషాడ బోనాల పండుగలో చివరి అంకం హైదరాబాద్ నగరాన్ని దద్దరిల్లేలా చేయనుంది. బోనాల అనంతరం అనవాయితీ లో భాగంగా.. ఫలహారం బండ్లు, తొట్టేలు, ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకోసం పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పాతబస్తీ, లాల్ దర్వాజ, బేగంపేట, బోయిన్ పల్లి వంటి ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. మరీ ముఖ్యంగా రామ్ నగర్, జవహర్ నగర్ ప్రాంతాల్లో ఈ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. దీంతో ఈ రోజు రాత్రి హైదరాబాద్ నగరం.. డీజే చప్పుల్లు, పొతరాలు నృత్యాలు, బ్యాండ్ చప్పుల్లు, యువకుల తీన్మార్ డాన్సులతో హైదరాబాద్ మహానగరం దద్దరిల్లనుంది.

Advertisement

Next Story

Most Viewed