Minister Ponnam : అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి..

by Sumithra |
Minister Ponnam : అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి..
X

దిశ, బేగంపేట : జంట నగరాల పరిధిలో జరిగిన బోనాల జాతర విజయవంతం పై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. బోనాల విజయవంతంలో దేవాదాయ శాఖ, పోలీస్, ఫైర్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర శాఖల అధికారుల సహకారంతో విజయవంతమైందని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అధికారుల సహకారంతో పాటు ప్రజల సహకారం కూడా తోడవడంతో జాతర విజయవంతమైందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలకు నిధుల పెంపుదల చేసినట్లు తెలియజేశారు. బోనాల జాతరకు ముందుగానే ఆయా ఆలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేశామన్నారు.

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సోమవారం జరిగిన రంగం భవిష్యవాణి కార్యక్రమంలో అమ్మవారు రాష్ట్రంలో పాడిపంటలు పుష్కలంగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశీర్వదించారని వ్యవసాయంలో మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేసినట్లయితే రాష్ట్రంలో రోగాలు లేకుండా ఉంటాయని తెలియజేశారని మంత్రి పొన్నం తెలిపారు. జూలై 28న లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి అన్నారు. ఆషాడ మాస బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు, రంగం, అంబారీ పై అమ్మా వారి ఊరేగింపు కార్యక్రమాలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన ప్రజలకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి వెంట హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమ, పవన్ ఖేరా ఆలయ అధికారులు వున్నారు.

Advertisement

Next Story

Most Viewed