- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGSRTC: బోనాల పండుగ వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బోనాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇప్పటికే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు ముగియగా.. ఈ నెల చివర్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నగరవ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుండి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాచిగూడ, జేబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్ నగర్, కూకట్ పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్ పల్లి నుండి సికింద్రాబాద్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు.