- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులకు పెద్దపీట : ఎమ్మెల్యే చందర్
దిశ, అంబర్ పేట్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు పెద్దపీట వేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. వసుంధర విజ్ఞాన వికాస మండలి సామాజిక సాంస్కృతిక చైతన్య వేదిక 30వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుకంటి చందర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కవులు, కళాకారుల పాత్ర కీలకమన్నారు. సమాజాన్ని మార్చే శక్తి కవులకు, కళాకారులకు మాత్రమే ఉందన్నారు. నేటి ఆధునిక సమాజంలో విద్యార్థులు దురలవాట్లకు బానిసలై అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో ర్యాగింగ్ లకు పాల్పడుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మధుకర్ గత 30 సంవత్సరాలుగా వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను చేపడుతూ.. కవులు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుగానే కాకుండా రచయితగా అనేక పుస్తకాలను రచించి సమాజాన్ని చైతన్య పరుస్తున్నారని తెలిపారు. అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి స్ఫూర్తి పురస్కారాలతో పాటు బాల పురస్కారాలను ప్రదానం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరం శంకరం, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, బాల సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పత్తిపాక మోహన్, వారాల ఆనంద్, నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైసా దేవదాస్, ప్రముఖ రచయిత శ్రీధర్, మౌనశ్రీ మల్లిక్, సంస్థ అధ్యక్షుడు చదువు వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కట్కూరి శంకర్, ప్రధాన కార్యదర్శి గుడికందుల భూమయ్య, కన్వీనర్ సుమలత , ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవాజ్ఞ శర్మ పాల్గొన్నారు.