- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓలా, ఊబర్, రాపిడోను నిషేధించాలి: ఆటో, టాక్సీ డ్రైవర్ల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆటో, టాక్సీ డ్రైవర్ల ఉపాధిని దెబ్బ తీస్తున్న ఓలా, ఊబర్, రాపిడ్, యారి బైకుల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని, గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో మీటర్ రేట్లు పెంచాలని తెలంగాణ ఆటో ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ రమేష్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి నాయకులు రవిశంకర్ అల్లూరి, పలెర్ల రవి, బి.పెంటయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న మహాలక్ష్మి పథకంపై పునరాలోచన చేయాలన్నారు. గ్రేటర్, జిల్లాల్లో ఆటో, గూడ్స్ వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆత్యహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దానికి అధ్యయన కమిటీని ప్రకటించాలని కోరారు. ఆర్టీఏ కార్యాలయాల్లో యూనియన్ల పేరుతో చెలామణి అవుతున్న బ్రోకర్లకు అడ్డుకట్ట వేయాలని, సీఎన్డీ,ఎల్పీజీ ఆటోలకు అనుగుణంగా గ్యాస్ ఔట్ లెట్స్ పెంచాలని, ఎలక్ట్రికల్ ఆటోలను ప్రోత్సహించి ప్రతి 15 కిలో మీటర్లకు ఒక చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని, ఐఆర్డీఏ పెంచిన ఇన్స్యూరెన్స్ రేట్లను 50 శాతం తగ్గించాలని కోరారు. రవాణారంగంలో వన్ నేషన్ వన్ టాక్స్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.