పసుపుమయమైన Mettuguda జంక్షన్

by S Gopi |   ( Updated:2022-12-21 01:58:56.0  )
పసుపుమయమైన Mettuguda జంక్షన్
X

దిశ, మెట్టుగూడా: ఖమ్మం వెళ్లనున్న చంద్రబాబుకు మెట్టుగూడలో ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ప్రయాణించనున్న మెట్టుగూడ మార్గంలో హోర్డింగ్‌లు, పసుపు జెండాలు, తోరణాలతో అలంకరించారు. మెట్టుగూడ జంక్షన్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దారి పొడవునా స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సతాయతమవుతున్నారు. సంవత్సరాల తరువాత పసుపు రంగు బ్యాన్నర్స్ కనిపిస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు మెట్టుగూడ చేరుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చే లక్ష్యంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలో తొలిసభ నిర్వహించబోతున్నారు. దీని కోసం తెలుగుతమ్ముళ్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read... .

అర్వింద్‌కు కేంద్రమంత్రి పదవి?

Advertisement

Next Story