Steel Bridge : స్టీల్ బ్రిడ్జ్‌పై బైకులతో పోకిరీల స్టంట్స్.. చర్యలు తీసుకోవాలని నెటిజన్ల ఫిర్యాదు

by Ramesh N |   ( Updated:2024-09-20 11:19:18.0  )
Steel Bridge : స్టీల్ బ్రిడ్జ్‌పై బైకులతో పోకిరీల స్టంట్స్.. చర్యలు తీసుకోవాలని నెటిజన్ల ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో కొందరు పోకిరీలు ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తూ, వచ్చి పోయే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల సిటీలోని పలు ప్రాంతాల్లో బైక్‌లపై స్టంట్స్ చేస్తూ దొరికిన ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. ఇంకా కొంత మంది మాత్రం బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్ నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిపై బైక్ స్టంట్స్ చేస్తూ ఆకతాయిలు హల్ చల్ చేశారు. సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టంట్‌లు కొంత మంది పోకిరీలు స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. స్టీల్ బ్రిడ్జ్‌పై రోజు రోజుకి ఆకతాయిలు రెచ్చిపోతున్నారని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story