- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొనసాగుతున్న వీధి కుక్కల వీరంగం.. జింకను చంపిన జాగిలాలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రదీప్విషాదాంతం నేపథ్యంలో ఒకవైపు మున్సిపల్సిబ్బంది పట్టుకుంటుండగానే బుధవారం వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. హైదరాబాద్, కరీంనగర్జిల్లాల్లో చిన్నపిల్లలపై ఎగబడి తీవ్రంగా గాయపరిచాయి. చైతన్యపురం మారుతినగర్లో నివాసముంటున్న బాలు వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అతని నాలుగేళ్ల కుమారుడు రిషి ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. రిషి పెట్టిన కేకలు విని కుటుంబసభ్యులు, స్థానికులు పరుగున వచ్చి వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అయితే, అప్పటికే కుక్కలు రిషి తల, తొడ, వీపు భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. ఇక రాజేంద్రనగర్హైదర్గూడలో కూడా ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఎర్రబోడ కాలనీలో ఇళ్ల ముందు ఆడుకుంటున్న చేతన్(8), పునీత్(6)లతోపాటు మరో ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్ర గాయపరిచింది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని ఎస్సీ హాస్టల్లోకి చొరబడ్డ వీధి శునకాలు 7వ తరగతి చదువుతున్న సుమంత్రెడ్డిపై దాడిచేసి గాయపరిచాయి. వెంటనే ఆ బాలుడిని కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వృద్దుడు నడుచుకుంటూ పనికి వెళుతుండగా కుక్క దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నంలో కిందపడ్డ మల్లారెడ్డికి తీవ్ర గాయాలు కావటంతో హుజురాబాద్ఆస్పత్రికి తరలించారు. సైదాపూర్మండలం జాగిరిపల్లిలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిపై కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇక, హైదరాబాద్ శివార్లలోని ఫీర్జాదీగూడవ ప్రాంతంలో ఉన్న జటాయువు పార్కులోకి చొరబడ్డ జాగిలాలు ఓ జింకను కరిచి చంపాయి.