నాలుగు జోన్లగా ‘మూసీ’..!

by srinivas |
నాలుగు జోన్లగా ‘మూసీ’..!
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు సంబంధించి డీపీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎకోలాజికల్, హెరిటేజ్, టూరిజం, మెట్రో జోన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా 15 వంతెనలు నిర్మించనున్నారు. హెరిటేజ్ జోన్ పరిధిలోకి వచ్చే వంతెనలు, భవనాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చేపట్టనున్నారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ మూసీలోని నాలుగు జోన్లలో చేపట్టే అ భివృద్ధి పనులను పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిన చేపట్టనుంది. మూసీపై మూ సారాంబాగ్, చాదర్ ఘాట్, ఇబ్రాహీంబాగ్, అత్తాపూర్ ప్రాంతాల్లో నాలుగు బ్రిడ్జిలను రూ. 168 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించనుంది. మిగిలిన 11 వంతెనల నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండీఏ చేపట్టనుంది. ఇందుకు హెచ్ఎం డీఏ రూ.377 కోట్లతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

వంతెన నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

మూసారాంబాగ్ హైలెవల్ వంతెన పనులు చేయడంతో బల్దియా అధికారులు వేగం పెంచారు. రూ.52 కోట్లతో మొత్తం ఆరులేన్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ముందుగా ఒక పక్కన మూడులేన్ల పనులు చేపడుతున్నారు. విద్యుత్‌కు సంబంధించిన కేబుల్స్ షిఫ్టింగ్ కోసం ఖర్చు జీహెచ్ఎంసీ భరించాలని విద్యుత్ శాఖ షిఫ్ట్ చేయలేదు. దీంతో కొన్ని నెలల పాటు పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కేబుల్స్ షిఫ్టింగ్‌కు అయ్యే ఖర్చు జీహెచ్ఎంసీ భరించాలని నిర్ణయించింది. త్వరలో విద్యుత్ కేబుల్స్ షిఫ్టింగ్ పనులు మొదలు పెట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఒక పక్కన పూర్తి చేసి, వచ్చే ఏడాది మరో పక్కన బ్రిడ్జి పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ బ్రిడ్జి 29.5 మీటర్ల పొడవుతో 6 లేన్లతో 20 మీటర్ల క్యారేజ్ వే 3.5 మీటర్ల ఫుట్ పాత్‌తో నిర్మాణం చేపడుతున్నారు.

స్థల సేకరణే సమస్య

21 కి.మీ.ల పొడువున మూసీని ఆక్రమిస్తూ ఆక్రమణలు ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు మూడుసార్లు గుర్తించినా, తొలగించటం పెద్ద సమస్యగా మారింది. వీటిలో చాలా ఆక్రమణలకు రెవెన్యూ పట్టాలు ఉండటంతో ముందుగా వారికి ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గత సర్కారు 10 వేల డబుల్ బెడ్ రూమ్‌లను కేటాయించినా, ఫలితం దక్కలేదు. తాజాగా శుక్రవారం సర్కారు ప్రకటించిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటె క్షన్ ఏజెన్సీ (హైడ్రా), జిల్లా రెవెన్యూ సమన్వయంతో మూసీ అభివృద్ధి, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి సర్కారు త్వరలోనే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story