సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

by Sridhar Babu |   ( Updated:2023-02-08 12:49:07.0  )
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
X

దిశ,మెట్టుగూడ : తిరుపతికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే ఫిబ్రవరి 10న సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనుంది. సికింద్రాబాద్ నుండి ఫిబ్రవరి 10వ తేదీన రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి తిరుపతి నుండి 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు కాచిగూడ, ఉందానగర్, షాధనగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు, ధోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed