- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో పెరుగుతున్న ‘టీబీ’ బాధితులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీబీ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. వేలాది మందిని కబళిస్తున్నది. ఈ ఏడాది కేవలం రెండు నెలల్లో 12,259 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కరోనా తర్వాత బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గడంతో టీబీ దాడి చేస్తున్నదని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్ లోనే ఎక్కువ...
రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే గుర్తిస్తున్నారు. 2022లో మొదటి ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
టీబీని నియంత్రించేలా...
2025 వరకు మన రాష్ట్రంలో టీబీ వ్యాధి నియంత్రించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధితులకు వేగంగా చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితులకు టీబీతోపాటు హెచ్ఐవీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. పాజిటివ్ తేలినోళ్లకు మందులు, అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 171 కేంద్రాల్లో టీబీ పేషెంట్లకు వైద్యం లభిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఆదుకుంటున్న ఆర్థిక సాయం
టీబీ పేషెంట్లకు డీబీటీ (నేరుగా నగదు బదిలీ) పద్ధతిలో ప్రతి నెల రూ.500 ఆర్థిక సాయం అందజేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60–40 శాతం పద్ధతిలో దీన్ని అందజేస్తున్నాయి. 2020లో క్షయ వ్యాధిగ్రస్తుల్లో 72 శాతం మందికి ఆర్థిక సాయం అందగా, 2021లో 83 శాతం మందికి, 2022లో 86.5 శాతం మందికి ఆర్థిక సాయం చేశారు. 2022లో 68,965 మంది ఆర్థికసాయానికి అర్హులు కాగా, 59,677 మందికి ఆర్థికసాయం అందినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
- Tags
- TB patients