- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటింగ్ తక్కువ నమోదైతే టికెట్ క్యాన్సిలా..? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మునుగోడు ఫీవర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. తాము ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న యూనిట్ లో ఎంత శాతం పోలింగ్ నమోదు అవుతుంది.. ఎంతశాతం టీఆర్ఎస్ కు పడుతుంది.. ఇతర పార్టీలకు ఎంతశాతం పడుతోందోనని భయాందోళనలకు గురవుతున్నారు. తక్కువ పోలింగ్ నమోదు అయితే తమ భవితవ్యం ఏమిటనేది మనోవేదనకు గురవుతున్నారు. నేతల పనితీరు ఆధారంగానే వారి భవిష్యత్, పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని అధిష్టానం తేల్చి చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ బాస్ పోలింగ్ పై పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోలింగ్ స్టేషన్ల వారీగా పార్టీలకు పడిన ఓట్లపై సమీక్షిస్తారు. పార్టీకి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి. తక్కువపడితే దానికి గల కారణాలు, అక్కడ పనిచేసినవారి వివరాలను తెలుసుకుంటున్నారు. లోటు పాట్లపై నేతలతో మాట్లాడారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా పని తీరును మెరుగు పర్చుకోవాలని, వారి భవిష్యత్ వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు దుబ్బాక, హుజూరాబాద్ , సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ పై సైతం సమీక్షించారు. ఇందులో దుబ్బాక, హుజూరాబాద్ లో ఓడిపోవడంతో ఇన్ చార్జులుగా పనిచేసే ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. మునుగోడు బైపోల్ సెమీఫైనల్ అని అన్ని పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం సీరియస్ గా తీసుకుంది. గెలుపు కోసం కృషి చేస్తుంది. అందులో భాగంగానే మునుగోడును 86 యూనిట్లుగా విభజించింది. ఈ యూనిట్లకు ఎమ్మెల్యేలను ఇన్ చార్జులుగా నియమించడంతో ఆయా యూనిట్ల పరిధిలోని ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
ఎమ్మెల్యేల్లో లబ్ డబ్...
మునుగోడు బైపోల్ రిజల్ట్ వచ్చే నెల 6న రానుండటంతో ఇప్పటినుంచే ఎమ్మెల్యేలో లబ్ డబ్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా వాటిపై కేసీఆర్ సమీక్షించనున్నారు. అయితే యూనిట్లకు ఇన్ చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటినుంచే ఆందోళనకు గురవుతున్నారు. ఓటింగ్ పైనే వారి భవిష్యత్ ఆధారపడటంతో యూనిట్ పరిధిలో ఎంత పోలింగ్ నమోదు అవుతుంది... టీఆర్ఎస్ కు ఎంత నమోదు అవుతుంది.. తక్కువ అయితే తమ భవిష్యత్ ఎంటనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం రాకుంటే పార్టీలో తనకు ప్రాధాన్యత ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నలు మొదలవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారా? లేదా? తాను ఇంకా ఏంచేయాలని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మునుగోడులో పార్టీ విజయం సాధించకపోతే ఏమిటనేది అర్ధంకాక కొట్టుమిట్టాడుతున్నారు.
కేటీఆర్... హరీష్ లకు ప్రతిష్ఠాత్మకమే...
మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మునుగోడు బైపోల్ కీలకమే. కేటీఆర్ కు గట్టుప్పల్, హరీష్ రావుకు మర్రిగూడ యూనిట్ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గట్టుప్పల్ కొత్త మండలం కావడం, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సర్పంచ్ టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో పాటు ప్రజల్లో సైతం కొంత ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఓటింగ్ ఎంత నమోదు అవుతుందో చూడాలి. మరోవైపు కేటీఆర్ మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడంతో ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారో చూడాలి. అదేవిధంగా మంత్రి హరీష్ రావు బాధ్యతలు నిర్వహిస్తున్న మర్రిగూడ కాంగ్రెస్ కు కంచుకోట. ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు పనితీరుకు యూనిట్ పరిధిలో నమోదు అయ్యే పోలింగ్ అద్దంపట్టనుంది. ఈ రెండు యూనిట్లలో పోలింగ్ పై సైతం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇది ఇద్దరి పనితీరుకు నిదర్శనం కానుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సునాయసంగా ఓట్లుపడే గట్టుప్పల్ ను కేటీఆర్ కు, కష్టపడితేనే ఓట్లు వచ్చే మర్రిగూడ యూనిట్ ను హరీష్ రావుకు అప్పగించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది కేసీఆర్ స్కెచ్ లో భాగమేనని రాజకీయ వేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మునుగోడు ఫలితాలపైనే ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి : నగదు బదిలీపై టీఆర్ఎస్ పక్కా స్కెచ్...