- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టఫ్ ఫైట్... ఎటుచూసినా కేసీఆర్ కే ఎఫెక్ట్ పడేలా ఉందంటా!
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కు కర్ణాటక టెన్షన్ పట్టుకుంది. జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం కావాలని గులాబీ బాస్ ఇప్పటికే ఆకాంక్షించారు. వచ్చే నెలలో కర్ణాటకలో ఎన్నికల ఉండగా ఆ పార్టీకి మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారంపై మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేసినా గెలవకపోతే.. అది కాస్త దేశ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే.. జాతీయ రాజకీయాలకు వెళ్తున్న బీఆర్ఎస్ కు ఆ పార్టీ దూరమయ్యే చాన్స్ ఉంది. దీంతో కేసీఆర్ కు ముందు నుయ్యి... వెనుక గొయ్యి అనే పరిస్థితి వచ్చి పడింది. దేశ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టఫ్ ఫైట్ ఎదురైంది. తొలి అడుగు కర్ణాటక ఎన్నికలతో వేయాలని భావించారు. ప్రసుత్తానికి ఆయనకు ఏం చేయాలో అర్థంకాని సంకట స్థితి ఏర్పడింది. కర్ణాటకలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఏస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఏప్రిల్ లో ఎన్నికలు ఉండగా.. 3 మూడు పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యాయి. గత డిసెంబర్ లో బీఆర్ఎస్ గా మార్పు జెండా ఆవిష్కరణ సందర్భంగా కేసీఆర్ కేంద్రంలో వచ్చేది రైతు ప్రభుత్వమేనని, కర్నాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని, కుమారస్వామి సీఎం కావాలని ఆకాంక్షించారు.
అక్కడా.. ఇక్కడా ఆ పార్టీలే...
అక్కడ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండగా పార్టీ తరఫున ప్రచారానికి కేసీఆర్ పార్టీ నేతలను ఇంకా పంపలేదు. మరోవైపు ఎజెండాను సైతం ప్రకటించలేదు. దీనిపై స్పష్టంగా ప్రకటించలేదు. జేడీఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. మన రాష్ట్రంలోనూ కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ లే. కర్ణాటకలోనూ జేడీఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ లే పోటీ. ఇక జేడీఎస్ కు ప్రత్యక్ష మద్దతు తెలిపి, ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసినా ఓడిపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండగా.. దీంతోనే పార్టీ నేతలను పంపడం లేదనే ప్రచారం ఊపందుకుంది. ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకే గత ఎన్నికల్లో పట్టంగట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుండగా జేడీఎస్ అధికారంలోకి రావడం కష్టమేననేది ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జేడీఎస్ తో ఎలా ముందుకుపోవాలో తెలియక కేసీఆర్ సతమతమవుతున్నారు. ఒకవేళ కుమారస్వామికి మద్దతు ఇవ్వకుంటే జాతీయస్థాయిలో కలిసి రాకపోవచ్చనేది రాజకీయవర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ఎటుచూసినా కేసీఆర్ కే ఎఫెక్ట్ పడేలా ఉంది.
దూరంగా ఉండడమే బెటర్ అనే భావన
కర్ణాటక ఎన్నికలు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లకు అస్త్రంగా మారవచ్చు. జేడీఎస్ కు మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారం చేశాక.. ఓడిపోతే ఇక్కడ రాష్ట్రంతోపాటు దేశరాజకీయాలపైనా ఎఫెక్ట్ పడే చాన్స్ ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ ను నిలువరించేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటకలోనూ జేడీఎస్ కు.. తెలంగాణలోనూ బీఆర్ ఎస్ కు ఆ రెండు పార్టీలే పోటీదారులుగా ఉండడంతో కేసీఆర్ కు అంతుచిక్కని పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ విజయం సాధించినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆ ఎఫెక్ట్ తెలంగాణపైనా ఉండొచ్చు. దీంతో కేసీఆర్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జేడీఎస్ కు మద్దతుగా పాల్గొనేకంటే దూరంగా ఉండటమే బెటర్ అనే భావనకు వచ్చినట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో నష్టపోవద్దనే భావనకు కేసీఆర్ వచ్చినట్లు సమాచారం. అక్కడ సర్వేల్లోనూ జేడీఎస్ కు పూర్తిస్థాయిలో మెజార్టీ రావడం లేదని తెలినట్లు సమాచారం. అందుకే ఆ రాష్ట్ర ఎన్నికలకు మరో నెలరోజులు మాత్రమే ఉన్నా బీఆర్ఎస్ ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేదని తెలిసింది.