Collector : మీ సేవ ధృవపత్రాల దరఖాస్తులను వారం లోగా పరిష్కరించండి

by Kalyani |
Collector : మీ సేవ ధృవపత్రాల దరఖాస్తులను వారం లోగా పరిష్కరించండి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : మీసేవ ద్వారా వివిధ దృవపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులన్నింటికీ వచ్చే సోమవారం లోగా పరిష్కారం చూపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు చేసుకున్న దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… కలెక్టరేట్ ప్రజావాణితో పాటు, సీఎం ప్రజావాణి లో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ లో లేకుండా సత్వరమే పరిష్కారం చేయాలని సూచించారు.

మీసేవ ద్వారా వివిధ సర్టిఫికెట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆర్జీలను ఏ మాత్రం పెండింగ్ లో ఉంచవద్దని , వాటికి వారం లోగా పరిష్కారం చేయాలన్నారు. మీసేవ ఆపరేటర్లతో ప్రతి నెల తహసీల్దార్లు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 156 దరఖాస్తులు రాగా గృహ నిర్మాణ శాఖ కు 121, పెన్షన్లు 08, భూ సమస్యలకు సంబంధించినవి 04, ఇతరములు 23 వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కదిరవన్, ఈ వెంకటాచారి, ఆర్డీఓలు మహిపాల్,దశరథ్ సింగ్, జిల్లా అధికారులు జి ఆశన్న, పెరిక యాదయ్య, ఆర్ కోటాజి, పవన్ కుమార్, డాక్టర్ సురేందర్, ఆర్.రోహిణి,ఇలియాజ్ అహ్మద్, షఫీమియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed