- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రచ్చకెక్కుతున్న సోషల్ వార్..
దిశ, శేరిలింగంపల్లి : సిల్లీలొల్లీలు.. తమ పరిధిలో లేని అంశాలు, ఏ సంబంధం లేని విషయాలు, దేశ, విదేశాల్లో జరుగుతున్న సంఘటనలు విషయం ఏదైనా సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కుతోంది. ఆయా సంఘటనల పై ఒకరికి ఒకరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో రచ్చరచ్చ చేస్తున్నారు. వాదోపవాదాలు, వాటిపై గతంలో తలెత్తిన వివాదాలు, అనుకూల, వ్యతిరేక వార్తలు, మీమ్స్, వీడియోలు, ఆడియోలు ఇలా ఎవరికి తోచింది వారు సిల్లీగా తగువులాడుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల సోషల్ వారు ఊపందుకుంది. ఇదొక్కటనే కాదు ప్రపంచంలోని అనేక ఘటనలపై వాట్సాప్ గ్రూపుల్లో అనునిత్యం ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది.
పొలిటికల్ గ్రూప్స్..
సోషల్ మీడియా కాలక్షేపానికే కాదు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు కూడా వేదిక అవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ హీట్ కంటే కూడా సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల పార్టీల మధ్య ఎక్కువగా కాక రాజేస్తున్నాయి. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అప్పుడప్పుడు ఇతర పార్టీలను సైతం మధ్యలోకి లాగుతూ హల్చల్ చేస్తున్నారు. మొన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితాల నుండి మొదలు కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఘటనకు మీరంటే మీరే కారణమంటూ సోషల్ మీడియాలో చిన్న సైజ్ యుద్ధమే నడుస్తుంది. ఇది ఒకటే కాదు ప్రతీ అంశంపై దగ్గరి స్నేహితులు సైతం సోషల్ మీడియాలో వాదోపవాదాలు చేస్తూ పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు.
ఆరోపణలకు, అసత్య ప్రచారానికి సైతం వేదికలు..
సోషల్ మీడియాను మంచికి, సమాచార సేకరణకు వినియోగిస్తే తప్పేమీ లేదు. అది ఒకరకంగా శుభపరిణామమే. కానీ సామాజిక మాధ్యమాలను కొందరు అసత్య ఆరోపణలకు, అర్ధ సత్యాలకు, నిందారోపణలకు వేదికగా మారుస్తున్నారు కొందరు వ్యక్తులు. ఒకరిపై ఒకరు చిలువలు, పలువలుగా వ్యాఖ్యానాలు చేస్తూ.. తమకు ఏది అనిపిస్తే అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో కొందరు వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం, వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం వాటిల్లేలా ఉంటుండడం బాధాకరం. ఇలాంటి వాటిపై పలువురు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఏదైనా అతిసర్వత్రా వర్జయేత్ అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిందే.