- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేపర్ లీకేజీ కేసులో నిందితుల ఇండ్లలో సిట్ సోదాలు
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు నాలుగో రోజూ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు హైద్రాబాద్, మహబూబ్ నగర్, జగిత్యాలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేస్తుంది. ఈ సోదాలలో సిట్ కీలక ఆధారాలు సేకరించారు. మణికొండలోని రాజశేఖర్ రెడ్డి ఇంట్లో మరికొన్ని ప్రశ్నాపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, రేణుకతోపాటు ఆమె భర్త డాక్యానాయక్‌తో కలిసి హైద్రాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
లంగర్ హౌస్ సన్ సిటీలోని కాళీమందిర్‌కు వెళ్లి అనుమానితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం లంగర్ హౌజ్ నుండి రేణుక సొంత ఊరు గండీడ్‌కు సిట్ అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. రాజశేఖర్ సొంతూరు తాటిపల్లి గ్రామంలో కూడ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసిన గోపాల్, నీలేష్‌కు సోదరుడు ఆర్థికసాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాల కొనుగోలుకు రాజేంద్ర నాయక్ డబ్బులు ఇచ్చాడని, మేడ్చల్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా కొంత డబ్బు ఇచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని సమాచారం.