అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ యాజమన్యానికి షోకాజు నోటీసులు

by Sridhar Babu |
అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ యాజమన్యానికి షోకాజు నోటీసులు
X

దిశ,కార్వాన్ : అబిడ్స్ రోడ్ లోని డోర్ నెం. 4-1-999 లో గల తాజ్ మహల్ హోటల్ (బి.సుందర్ రావు హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్)లో పప్పులో పురుగు కనిపించడంపై సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ మాట్లాడుతూ ఈనెల 24న ఆ హోటల్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు.

తనిఖీలో భాగంగా ఆ హోటల్ లో సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, లేబుల్స్ లేవని, నిల్వ చేసే ప్రదేశంలో బొద్దింకలు ఉన్నాయని బుధవారం ఆహార భద్రత అధికారులు గమనించారని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా హోటల్ నిర్వాహ‌కులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. వారి సంజాయిషి అందిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story