‘ప్రేమికుల రోజు’ వేడుకలు జరగనివ్వం.. తెలంగాణ శివసేన పార్టీ హెచ్చరిక

by Ramesh N |
‘ప్రేమికుల రోజు’ వేడుకలు జరగనివ్వం.. తెలంగాణ శివసేన పార్టీ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిబ్రవరి 14 తేదీన ప్రేమికుల రోజు వేడుకలు జరిపితే ఊరుకునే ప్రసక్తేలేదని తెలంగాణ శివసేన పార్టీ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఇవాళ శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14న ప్రేమ దోమ అంటే ఒప్పుకోమనీ, వ్యాలెంటైన్‌ కి ఈ దేశానికీ ఎలాంటి సంబంధం లేదన్నారు. హగ్‌ డే, కిస్‌ డే, చాక్లాట్‌ డే, ప్రపోజ్ డే, ఇవన్నీ ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14 తేదీ రోజు పుల్వామా ఘటనలో మరణించిన సీఆర్పీఎఫ్ వీర సైనికుల త్యాగ దినంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేశం అమరులైన పుల్వామ ఘటన వీరుల త్యాగ దినం జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వాలెంటైన్ ప్రేమికుల రోజు పేరిట హడావిడి చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రేమికుల రోజు అంటూ ఎక్కడ నిర్వాహకులు వేడుకలు చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసేందుకు కొన్ని శక్తులు బలంగా ముందుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ దోమ అంటూ పార్క్‌లు, పబ్, హోటల్స్ లాంటి ఇతర ప్రదేశాల్లో హంగామా చేస్తే ఊరుకోంమంటూ తేల్చిచెప్పారు. ప్రేమానురాగాలకు ప్రతిరూపమే భారతదేశం, ఈ దేశంలో 365 రోజులు ప్రేమను పంచుతూ పొందుతూ జీవిస్తారు.. కానీ ప్రత్యేకంగా ఒకే ఒక్క రోజు ప్రేమ రోజు అంటూ వేషాలు వేస్తే తిప్పి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Advertisement

Next Story