జాబ్ నోటిఫికేషన్‌ విడుదలపై జాప్యం తగదు: ఆర్.కృష్ణయ్య

by Disha News Web Desk |
జాబ్ నోటిఫికేషన్‌ విడుదలపై జాప్యం తగదు: ఆర్.కృష్ణయ్య
X

దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్ట బబ్లుగౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై ఆవిష్కరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కట్ట బబ్లు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జూలూరి మహేష్ గౌడ్, చింత మహేష్, గడ్డం శివ, నరసింహా గౌడ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story