Education Act : విద్యాహక్కు చట్టం ఈ సమావేశాల్లోనే అమలు పర్చాలి..

by Sumithra |
Education Act : విద్యాహక్కు చట్టం ఈ సమావేశాల్లోనే అమలు పర్చాలి..
X

దిశ, హిమాయత్ నగర్ : ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యాహక్కు చట్టం అమలు పర్చాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల, నిరుపేద వర్గాల హక్కుల ఉద్యమ వేదిక 'బహుజన ప్రజాశక్తి' తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులు నియంత్రించాలన్నారు. అధిక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు.

విద్యావ్యవస్థ పై 15 శాతం నిధులు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత స్కీంల స్థానంలో అన్ని వర్గాలలోని పేదవర్గాలకు చదువు ప్రభుత్వ స్కూల్ నుంచి పీజీ, పీహెచ్డీ వరకు విద్యను ఉచితంగా అందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సాంఘీక సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ కాలేజీలు, యూనివర్సిటీలను బాగుపర్చాలన్నారు. బహుజన వర్గాల నుంచి యూనివర్సిటీల వైస్ చాన్సిలర్లను నియమించాలన్నారు. కుల వివక్షత నిర్మూలించి, సమసమాజం స్థాపించాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు రజక గోపి, బీఎన్.రమేష్ కుమార్, పారంద స్వామి, నర్సింగ్ రావు, యోనస్, మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed