హైదరాబాద్ కు రేవంత్ మరిన్ని నిధులివ్వాలి.. కిషన్ రెడ్డి డిమాండ్

by Nagam Mallesh |
హైదరాబాద్ కు రేవంత్ మరిన్ని నిధులివ్వాలి.. కిషన్ రెడ్డి డిమాండ్
X

దిశ, కార్వాన్ః నిధుల కేటాయింపులో హైదరాబాద్ కు అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నాంపల్లి అసెంబ్లీ, గుడిమల్కాపూర్ డివిజన్ లో తన ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరమని.. కాబట్టి ఈ నగరానికి మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. అధిక ఆదాయం వస్తున్న హైదరాబాద్ కు కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పాతనగరం అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైటెక్ సిటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ద పాత నగరంపై సారించడం లేదన్నారు. నగర అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed