Good News: 25 వేల పోస్టులకు మెగా డీఎస్సీ.. థ్యాంక్స్ చెప్పిన నిరుద్యోగులు

by srinivas |
Good News: 25 వేల పోస్టులకు మెగా డీఎస్సీ.. థ్యాంక్స్ చెప్పిన నిరుద్యోగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ పార్టీ అధికారంలోకి రాగానే దాదాపు 25 వేల టీచర్ పోస్టులకు తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం తెలిపింది. మెగా డీఎస్సీ అంశం కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినందుకు ఇవాళ జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం నాయుకులు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా 4 లక్షల మంది అభ్యర్థులు మెగా డీఎస్పీ కోసం ఎదురుచూస్తే ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా కేవలం 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి చాలా జిల్లాల్లో అరకొర పోస్టులతో అన్యాయం చేశారని, అభ్యర్థులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పోస్టులు పెంచకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అధికార పార్టీ వాళ్ల మేనిఫెస్టో‌లో టీచర్ పోస్టులపై చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో మెగా డీఎస్సీ అంశం చేర్చినందున, అభ్యర్థులకు న్యాయమైన హామీ ఇచ్చినందున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story