- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు : ఎమ్మెల్యే గాంధీ
దిశ, శేరిలింగంపల్లి : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర జీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి సైతం నీరు చేరి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. గంగారం పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో పూర్తిగా నీరు చేరింది. అపర్ణకు వెళ్లే దారిలో పూర్తిగా నీరు చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గత రాత్రి నుండి స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
సోమవారం ఉదయం దీప్తిశ్రీనగర్, గంగారం, మియాపూర్ లక్ష్మీ నగర్ చెరువు, అల్వీన్ కాలనీ ఫేజ్ 2, అంబీర్ చెరువు, ఎల్లమ్మబండ, ధరణి నగర్, లింగంపల్లి, చందానగర్ గంగారం పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో మ్యాన్ హోల్స్ లను క్లియర్ చేయించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసినా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా.. అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.