మియాపూర్ లో ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం..

by Nagam Mallesh |
మియాపూర్ లో ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం..
X

దిశ, శేరిలింగంపల్లిః మియాపూర్ లో సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీస్ అధికారులు. ఎస్ ఓటీ టీమ్, మియాపూర్ పోలీసులు కలిసి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ స్వర్ణపురి కాలనీలోనీ ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుంది. పక్కా సమాచారంతో గురువారం రాత్రి మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలితో పాటు ఓ విటుడిని, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story