- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండెపోటు వ్యక్తికి సీసీఆర్ చేసి బతికించిన పోలీసులు
దిశ,బేగంపేట : గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రాణాలు కాపాడారు. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి స్వయంగా బాధితుడికి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా కిందన ప్రాంతంలోని మెయిన్ వీధికి చెందిన తాపీ మేస్త్రీ గుజ్జల రాములు(60)బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో నివాసం ఉంటున్నాడు. పనికోసం రోజూ అడ్డా వద్దకు వెళ్తుంటాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఫుట్పాత్ నుంచి నడుచుకుంటూ
వెళ్తుండగా ఒక్కసారి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగారావు పర్యవేక్షణలో ముఖ్యమంత్రి రూట్ బందోబస్తు కోసం బేగంపేట ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నారు. సమీపంలోనే ఉన్న ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి కిందపడిన రాములును గుర్తించాడు. సంఘటన స్థలానికి చేరుకుని ఇతర పోలీసు సిబ్బంది సాయంతో బాధితుడి గుండె నొక్కుతూ సీపీఆర్ చేశాడు. అనంతరం అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడు ఇంటికి చేరుకున్నాడు. తమ తండ్రి పరిస్థితి మెరుగ్గానే ఉందని కుమారుడు అశోక్ తెలిపారు.