- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bettig Apps: 11 మంది యూట్యూబర్స్,ఇన్ ఫ్లూయెన్సర్స్‌ల ఆర్థిక లావాదేవీలపై పోలీసుల నజర్..

దిశ,సిటీ క్రైమ్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, కేసు నమోదైన 11 మంది ఇన్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కారణంగా ఎవరైనా బెట్టింగ్ లు పెట్టి వారు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు మా దర్యాప్తులో ఆధారాలు దొరికితే వారి పై కచ్చితంగా బీఎన్ఎస్ 108 కింద అభియోగం నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈ అభియోగంలో ఆధారాలు నిరూపించబడితే 10 జైలు శిక్ష ఖాయమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్ లు, టీవీ ఆర్టిస్టులు, ఇన్ ఫ్లూయెన్సర్స్ ల పై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుకు అనుగుణంగా ఆధారాలను సేకరిస్తున్నామన్నారు.
ఆధారాలను బట్టి ఈ 11 మందికి నోటీసులు ఇచ్చి విచారణ చేయడంతో అరెస్ట్ లు కూడా చేస్తామని తెలిపారు. చట్టపరంగా ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పరేషాన్ బాయ్స్ ఐడీని నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అసభ్యంగా, అభ్యంతకరంగా చిన్నారులతో వీడియోలను చేసి ప్రచారం చేయడం సరికాదన్నారు. అదే విధంగా వారి సొంత లాభాల కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసి నిరుద్యోగులు, యువతను ఆర్ధికంగా నిండా మునిగేలా చేయడం సహించరాని నేరమన్నారు. ఈ బెట్టింగ్ యాప్ ల నుంచి ఇన్ ఫ్లూయెన్సర్స్ లు ఆర్ధికంగా ఎంత లాభపడ్డారు. ఎలా డబ్బులు తీసుకున్నారు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తామన్నారు.
ఇప్పటికే కొంతమంది ఇన్ ఫ్లూయెన్సర్స్ లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఉండగా మిగతా సారీ అంటూ పాత వీడియోలను డిలీట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డిలీట్ చేసిన ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ టూల్స్ వాటన్నింటిని బయటకు తీస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ రోజు విష్ణుప్రియను విచారణకు సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మీ తో పాటు మరికొందరు సినీ హీరోయిన్ ల బెట్టింగ్ ప్రమోషన్స్ కు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో వారిపై కూడా కేసులు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read More..
చిన్నోళ్ళు సరే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హీరో, హీరోయిన్స్‌పై కేసులు పెట్టరా? నెటిజన్స్