- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్లో హ్యాట్రిక్ సాగించిన పద్మారావు గౌడ్
దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ 45,625 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. లష్కర్ చరిత్రలో వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన మొదటి ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,62,517 ఓట్లు ఉండగా 1,41,105 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి 32,598, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థికి 25,012 దక్కాయి. రాష్ట్ర మంతటా కాంగ్రెస్ గాలి వీచిన్నప్పటికి సికింద్రాబాద్లో
మాత్రం అది పెద్దగా కనిపించలేదు. పద్మారావు గెలుపునకు కారణం ఆయనకు మాస్ ప్రజల్లో ఉన్న అభిమానం అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ, మాస్ లీడర్ కావడమే ఆయన గెలుపుకు కారణం. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండడంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్, సీఎం రిలీఫ్ వంటి చెక్కులు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటికి వెళ్లి మరీ అందించారు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో పద్మారావు చెరగని ముద్ర వేసుకున్నారు. దీనికి తోడు బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో గట్టి పోటీ లేకుండా పోయింది.
- Tags
- Padma Rao Goud