- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
On passive technology : 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగుల ఆందోళన..
దిశ, శేరిలింగంపల్లి : ఉద్యోగుల చేత గొడ్డు చాకిరీ చేయించుకున్న సంస్థ.. గత 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అడిగిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రోడ్డులోని హుడా కాలనీ డీఎస్ ఆర్ ఇన్స్పైర్ ప్లాట్ నెంబర్ 21 లో ఆన్ పాసివ్ టెక్నాలజీస్ పేరున ఓ ఐటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో 500 లకు పైగా ఉద్యోగులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. అయితే వీరికి గత 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీనిపై పలుమార్లు ఉద్యోగులు సంస్థ యాజమాన్యాన్ని జీతాలు ఇవ్వాలని కోరినా ఏమాత్రం స్పందించడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను అంతర్గతంగా పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి సంస్థ ఏ మాత్రం స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. సంస్థలో పనిచేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగులను, వారి కుటుంబాలను యాజమాన్యం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిందని, తమ జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తుందన్నారు. ఆన్ పాసివ్ టెక్నాలజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా సోమవారం బాధిత ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అంతకు ముందు ఆన్ పాసివ్ కంపెనీ యాజమాన్యం పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.