- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షాలకు అధికారులు అలర్ట్
దిశ , హైదరాబాద్ బ్యూరో : మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 141 లొకేషన్లలో 242 ఎమర్జెన్సీ టీంలు,157 మొబైల్ టీంలు, 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి 7 ఎమర్జెన్సీ టీంలు, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల నుండి నాలుగు చొప్పున అదనపు ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నాయి.
బల్దియా కంట్రోల్ రూమ్ లో 12 మంది బృందం, డీఆర్ ఎఫ్ కంట్రోల్ రూమ్లో 10 మంది బృందం 24 X 7 పని చేస్తున్నాయి. వర్షంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా రోడ్డుపైకి రావద్దని, అవసరమైన సహాయానికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వర్షం తగ్గిన తర్వాత వైరల్ ఫీవర్లు, ఇతర వ్యాధులతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసేందుకు బల్దియా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
గ్రేటర్ లో అత్యధికంగా 9 సెంమీ వర్షపాతం నమోదు ...
జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్టంగా 9 సెంమీ వర్షపాతం నమోదైంది. అయితే వర్షంతో వాటర్ స్టాగ్నేషన్ కన్నా ఎక్కువగా చెట్లు పడిపోయాయి. వాటిని జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అంతేకాకుండా అత్యవసర సమయాలలో ప్రజలకు అవసరమైన సహాయానికి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో స్టాటిస్టిక్స్ ఎమర్జెన్సీ , డీఆర్ ఎఫ్ టీంలు సంయుక్తంగా పని చేయడమే కాకుండా ఇతర విభాగాల అధికారులందరూ క్షేత్ర పరిధిలో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తం చేయడమే కాకుండా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కంట్రోల్ రూంకు 141 ఫిర్యాదులు....
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు సోమవారం ఉదయం వరకు వాటర్ స్టాగ్నేషన్ కు సంబంధించి 141 ఫిర్యాదులు రాగా వీటిల్లో అధికారులు 140 క్లియర్ చేశారు. చెట్లు పడిపోయిన సంఘటనలకు సంబంధించి 140 ఫిర్యాదులు అందగా వీటిల్లో 137 కూలిన చెట్లను తొలగించారు. గ్రేటర్ వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 596 భవనాలను అధికారులు గుర్తించగా 344 భవనాలపై చర్యలు తీసుకున్నారు.
129 భవనాలను ఖాళీ చేయించారు. మరో నాలుగింటికి సీల్ వేశారు. 107 వాటర్ ట్యాంకుల మరమ్మతులు చేయించారు. అంతేకాకుండా వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో ఉంటూ గూడు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు లేనప్పటికీ ముందస్తుగా అన్ని చర్యలను అధికారులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీసీపీ శ్రీనివాస్, (యు బిడి) అడిషనల్ కమిషనర్ సునంద, కంట్రోల్ రూమ్ ఓ ఎస్ డీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూంను తనిఖీ చేసిన మేయర్...
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సోమవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు. ఓఎస్డీ అనురాధ తో ఇప్పటివరకు నగరంలో పడిన వర్షపాతం, అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు, వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నీటి మట్టాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ మొదలు అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారని తెలిపారు.
- Tags
- rains