తెలుగు ఛానల్‌లో అశ్లీల వీడియోలు ప్రసారం.. షాక్ అయిన ప్రేక్షకులు

by Hamsa |   ( Updated:2023-05-01 16:29:42.0  )
తెలుగు ఛానల్‌లో అశ్లీల వీడియోలు ప్రసారం.. షాక్ అయిన ప్రేక్షకులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు టీవి ఛానల్‌లో అర్థరాత్రి సమయంలో అశ్లీల వీడియోలు ప్రసారమయిన ఘటన కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అది చూసిన ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12‌లోని ఎమ్మెల్యే కాలనీ‌లో ఉన్న ఓ కార్యాలయం నుండి ఓ తెలుగు టీవి ఛానల్ తమ కార్యకలాపాలను సాగిస్తోంది. హైదరబాద్‌తో పాటు పలు ప్రదేశాల్లో ఈ ఛానల్ లైవ్ ప్రసారాలు సాగిస్తోంది. అయితే ఏప్రిల్ 28న అర్థరాత్రి సమయంలో ఈ ఛానల్‌లో అశ్లీల వీడియోలు దాదాపు 15 నిమిషాలు ప్రసారమయ్యాయి. దీంతో వాటిని చూసిన వీక్షకులు వెంటనే ఛానల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న ఛానల్ నిర్వాహకులు తమ సిబ్బందిని అప్రమత్తం చేసి అశ్లీల వీడియోల ప్రసారాన్ని నిలిపివేశారు. ఈ అశ్లీల వీడియోల ప్రసారంపై ఛానల్ నిర్వహకులకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఛానల్‌ను అప్రతిష్టపాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పెర్కొన్నట్టు సమాచారం.

Read more:

సెక్స్ తర్వాత యూరిన్ చేస్తే గర్భం రాదు

Advertisement

Next Story