TNGO : బదిలీల అక్రమాలు జరిగాయని ఎలాంటి ప్రకటన చేయలేదు..

by Sumithra |
TNGO : బదిలీల అక్రమాలు జరిగాయని ఎలాంటి ప్రకటన చేయలేదు..
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : వైద్య , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బదిలీల్లో అక్రమాలు జరిగాయని తాము ఎటువంటి పత్రికా ప్రకటన ఇవ్వలేదని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీలు ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖ బదిలీలలో ఉద్యోగ సంఘాల లేఖలు తదితర అంశాల పై కొన్ని దిన పత్రికలలో వచ్చిన వార్తలు ప్రచురితమయ్యాయని, వీటికి తమకు సంబంధం లేదని తెలిపారు.

కొంతమంది ఉద్యోగులు తమ స్వార్థం కోసం టీఎన్జీవో సంఘం పేరును దుర్వినియోగం చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిని గుర్తించి వారి పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ పారదర్శకంగా పని చేస్తున్నారని, ఆయనకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని వారు తెలిపారు. కొంతమంది స్వార్థపరుల వల్ల బదిలీలలో కొన్ని ఆటంకాలు జరిగాయని వారి వల్లనే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఉద్యోగుల శ్రేయస్సు విషయంలో ఎలాంటి రాజీపడబోమని అన్నారు.

Advertisement

Next Story