- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త టెన్షన్.. కింది స్థాయి సిబ్బంది స్టేట్‌మెంట్లతో బడా ఆఫీసర్లలో పరేషాన్
దిశ, సిటీ క్రైం: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వ పెద్దలతో కొంతమందికి సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీసు అధికారుల నిబంధనల ఉల్లంఘనలపై స్టేట్‌మెంట్లు ఇచ్చిన కింది స్థాయి సిబ్బందికి ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులతో పాటు ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారంపై దర్యాప్తు అధికారులు ప్రతి అంశాన్ని విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నిబంధనలను అతిక్రమించి అక్రమ పద్ధతిలో పనిచేసిన పోలీసు అధికారులు తప్పుడు చర్యలను దర్యాప్తు అధికారుల మీద భరోసాతో చాలామంది కింది స్థాయి అధికారులు జరిగిన దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో దర్యాప్తు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రూల్స్‌ను తుంగలో తొక్కి వారి స్వార్ధం, మెప్పు కోసం చేసిన పోలీసు ఆఫీసర్లు చేసిన పనులకు అన్ని పక్కా సాక్ష్యాలు దొరికాయి. సేకరించిన ఆ సాక్ష్యాలను అన్నింటిని ఆన్ రికార్డుగా కోర్టు ముందు ఉంచనున్నారు. అయితే, ప్రస్తుతం స్టేట్‌మెంట్లు ఇచ్చిన కింది స్థాయి సిబ్బంది ఇప్పుడు ఆ అధికారులకు టార్గెట్‌గా మారారని తెలిసింది. వాంగ్మూలం అలా ఎందుకు ఇచ్చావు. అవకాశం వచ్చినప్పుడు నీ సంగతి చెప్పుతామంటూ కొంత మంది అధికారులు మాటలతో సిబ్బందిలో కలవరం రేపుతున్నారని సమాచారం. ఇలా ఓ ఐపీఎస్ అధికారి, డీఎస్పీలకు సంబంధించిన వ్యవహారంలో స్టేట్‌మెంట్ ఇచ్చిన సిబ్బంది ఆ తరహా వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
9 సార్లు డబ్బు రవాణా..
హైదరాబాద్ సమీపంలోని ఓ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నిక సందర్భంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు డబ్బు రవాణ కోసం స్కెచ్ వేశారు. ఈ డబ్బును ఆ జిల్లా ఎస్పీతో పాటు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ హైదరాబాద్ నుంచి ఉపఎన్నిక జరుగుతోన్న నియోజకవర్గానికి ఓఆర్ఆర్ మీదుగా 9 సార్లు తరలించారని దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ తరలింపులో పాల్గొన్న సిబ్బందిని విచారించిన ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అధికారులు, సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. వారందరూ జరిగింది అంతా చెప్పేశారు. దీంతో ఐపీఎస్ అధికారితో పాటు డీఎస్పీ నిబంధనల ఉల్లంఘన బట్టబయలు అయింది. ఈ అంశాన్ని తాజా ప్రభుత్వానికి, పోలీసు శాఖ పెద్దల నజర్‌లో ఉంది.
ఆ నిబంధనల ఉల్లంఘనలపై చట్టపరంగా ఐపీఎస్ అధికారి, డీఎస్పీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే వాదన పోలీసు వర్గాల్లోనే బలంగా వినిపిస్తుంది. అయితే, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరగడంతో అధికార ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామంతో నిబంధనలను అతిక్రమించిన అధికారులపై చట్ట ప్రకారం ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఇచ్చిన సిబ్బందికి వారి కుటుంబాల్లో హైటెన్షన్ మొదలైంది. ఈ ఒత్తిళ్లు ఎక్కడికి దారి తీస్తాయనేది వేచి చూడాల్సిందే. పోలీసు వృత్తిలో ఉంటూ నిజం చెప్పినా పరేషాన్ ఉందని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలమని ప్రతిజ్క్ష చేసిన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పెద్ద సైలెంట్ అవడంతో కింది స్థాయి సిబ్బంది వారి పరిస్థితి తలచుకుంటనే ఉలిక్కి పడుతున్నారని తోటి పోలీసులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.