- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లివర్ డ్యామేజ్, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తోనే నాగలక్ష్మి మృతి
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన జూనియర్ డాక్టర్ నాగలక్ష్మి (28) మృతిపై మెడికవర్ ఆస్పత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. ఠాగూర్ సినిమాను తలపించేలా మెడికవర్ ఆస్పత్రిలో డెడ్ బాడీ కి చికిత్స, బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారంటూ పలు మీడియాలో వచ్చిన కథనాలను మెడికవర్ వైద్యులు, మేనేజ్మెంట్ ఖండించారు. నాగలక్ష్మి ఫుడ్ పాయిజన్ తో ఆమెకు దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స పొందారని, అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఓ పెద్ద ఆస్పత్రికి తరలించారని అన్నారు. అక్కడి నుండి ఓ వైద్యుడి రిఫరెన్స్ ద్వారా మా వద్దకు వచ్చారని, అప్పటికే ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని, ఆమె బ్రతుకెందుకు కేవలం 20 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని తెలిపారు.
అయితే వైద్యులుగా ప్రతీ పేషేంట్ ను బతికించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అందులో భాగంగానే నాగలక్ష్మి ని జాయిన్ చేసుకున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఆమె పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడమని ఆమెకు ప్లాస్మా ఛేంజ్ చేయాల్సి ఉందని వారికి చెప్పామన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతనే ఆమెకు సరైన వైద్యం అందించామన్నారు. కానీ అప్పటికే ఆమె లివర్ ఫంక్షన్ పాడైందని, అలాగే మల్టీ ఫుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని అందువల్లనే ఆమె మృతి చెందారని అన్నారు. అయితే తాము డబ్బుల కోసం పేషేంట్స్ బంధువులను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, అలాగే చనిపోయాక ఆమెకు ఎలాంటి వైద్యం అందించలేదని మెడికవర్ వైద్యులు స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలనే ఠాగూర్ సిండ్రోమ్ ను సృష్టించి తమపై ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.
వైద్యంలో నమ్మకమే ముఖ్యమని, డాక్టర్లపై నమ్మకం ఉంటేనే పేషేంట్ ను బాగు చేయగలమన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల డాక్టర్లు సరైన ప్రాక్టీస్ చేయలేరని అన్నారు. కొందరి వల్ల మెడికల్ వ్యవస్థపై జనాలకు నమ్మకం పోతుందని, అలాంటి ప్రచారం సరైనది కాదని మెడికవర్ వైద్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ సతీష్ కైలాశం, డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, డాక్టర్ ఉమాపతి, డాక్టర్ మితిలేష్ తదితరులు పాల్గొన్నారు.