- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నర్సింగ్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే తలసాని
దిశ,బేగంపేట : నర్సింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కాలేజీలోని విద్యార్థులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఆయన సోమవారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ లో గల గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని సందర్శించారు. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల సంఖ్య, సమస్యలపై అద్దికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 400 మంది నర్సింగ్ విద్యార్థులు ఉన్న కాలేజీలో నెలకొన్న సమస్యలపై పూర్తిస్థాయి ప్రతిపాదనలను రూపొందించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, కాలేజీ ప్రిన్సిపాల్ భారతి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషన్ సమ్మయ్య, ఈ ఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ డి జిఎం ఆశిష్, శానిటేషన్ డి ఈ దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసిపి సుస్మిత, తదితరులు ఉన్నారు.