- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..
దిశ, శేరిలింగంపల్లి: అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీనిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ సూచించారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో సగర సంఘం కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ రోజాదేవి రంగరావుతో కలిసి పరిశీలించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు.
అలాగే వైద్య సిబ్బందిని కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు ,హరినాథ్, ఆంజనేయులు, దయాసాగర్, మోహన్ రావు, చంద్రమోహన్ సాగర్, వెంకటస్వామి సాగర్, విద్యాసాగర్, శివ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.