- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గౌరవప్రదంగా అంత్యక్రియలు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
దిశ, ఎల్బీనగర్: సమస్యలు లేకుండా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మశాన వాటికలను తీర్చిదిద్దుతున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ స్మశానవాటికలో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు స్మశాన వాటికలంటే ముళ్లకంపలు, చెట్ల పొదలు దర్శనమిచ్చేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సకల హంగులతో, పర్యావరణానికి అనుగుణంగా స్మశాన వాటికలు తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. దాదాపు రూ.1.92 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతానికి పనులు నిర్మాణ దశలో ఉన్నాయని, బర్నింగ్ యార్డ్, పచ్చిక బయళ్ళు, మూత్రశాలలు, మూడు దహన వాటికలు, కూర్చోవడానికి బల్లలు, బ్రహ్మాణులకు ప్రత్యేక లాకర్ సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అత్యంత సుందరంగా స్మశాన వాటికలను తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, శ్రీనివాస్ యాదవ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.